రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామగుండం 50 డివిజన్లకు సంబంధించి కేటీఆర్ క్రికెట్ గోల్డెన్ కప్ లో బసంత్ నగర్ లంబాడి తండా లగాన్ టీం పై 33 డివిజన్ DSK Xl’S ఘన విజయం సాధించింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు మహిళలకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం TRS ప్రభుత్వం (పార్టీ) అని ఈ సందర్భంగా తెలియజేశారు.
యువత అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పోటీలో గెలుపొందిన టీం సభ్యులందరికీ విజయమ్మ ఫౌండేషన్ మరియు MLA కొరకంటి చందర్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న టువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజల పక్షాన DSK XL’S టీం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు