నితిన్ సినిమా ‘భీష్మ’ టీజర్ విడుదల

500
Nithin movie Bheeshma teaser released

వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్‌ హీరో నితిన్ – క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నజంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌గా తెరకుక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌, సింగిల్‌ ఆంథమ్‌ సాంగ్‌లతో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదలకానుంది.