ప్రభాస్‌కు తల్లిగా భాగ్యశ్రీ

960
bhagyashree reentry in prabhas movie jaan

80వ దశకంలో మైనే ప్యార్ కియా సినిమాతో తన అందం, నటనతో క్రేజీ హీరోయిన్‌గా మారిన నటి భాగ్యశ్రీ. దేశం మొత్తం ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న భాగ్యశ్రీ.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్నారు. 20 ఏళ్ల క్రితం రాజశేఖర్ ఓంకారంలో ఆమె నటించారు. రెండేళ్ల క్రితం 2 స్టేట్స్ రీమేక్ కి సంతకం చేశారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రాణా సినిమాలో చెల్లెలి పాత్రలో ఆమె నటించింది. తర్వాత ఎప్పుడూ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

కానీ త్వరలోనే గ్రాండ్‌గా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న భాగ్యశ్రీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అమ్మగా నటించేందుకు ఒప్పుకుంది. రాధాకృష్ణ డైరెక్షన్‌లో ప్రభాస్ జాన్ అనే సినిమా చేస్తుండగా.. భాగ్యశ్రీ ఈ చిత్రంలో ప్రభాస్‌ తల్లి పాత్రలో కనిపించనుంది. చాలా సంవత్సరాల విరామం తర్వాత భాగ్యశ్రీ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తల్లి పాత్ర జాన్ సినిమాలో కీలకమని.. ఆ పాత్రకు అనేక ఆప్షన్లు పరిశీలించి చివరికి భాగ్యశ్రీని ఖరారు చేసినట్లు దర్శకులు తెలియజేసారు. ప్రభాస్, భాగ్యశ్రీ మధ్య సన్నివేశాలు భావోద్వేగ భరితంగా ఉంటాయని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెబుతున్నారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం.

పాన్ ఇండియా నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘సాహో’ సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఆ సెట్ ఖరీదు సుమారు మూడు కోట్ల రూపాయలట. ఇక్కడ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి అవుట్ డోర్ షూటింగ్ చేయడానికి ప్రభాస్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు.