ఆది ‘బుర్రకథ’ ట్రైలర్‌ విడుదల

333
burrakatha movie trailer

ప్రేమ కావాలి, లవ్‌లీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఆది సాయికుమార్‌. కానీ మళ్లీ ఆరేంజ్‌ సక్సెస్‌ను కొట్టలేక రేసులో వెనుకబడ్డాడు. తాజాగా ఓ డిఫరెంట్‌ కథతో తెరకెక్కిన బుర్రకథ చిత్రంతో హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి మంచి గుర్తింపుతెచ్చుకున్న డైమండ్ రత్నబాబు, తొలి సారి దర్శకత్వం వహిస్తున్న సినిమా బుర్రకథ. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మంచి అంచనాలే ఏర్పరిచాయి. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.

ఒకే మనిషిలో రెండు బుర్రలు, రెండూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉండటం, వాటి వల్ల క్రియేట్‌ అయ్యే ఫన్‌, వచ్చే కష్టాలు ఇలా అన్నింటిని టచ్‌ చేస్తూ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్లు తెలుస్తోంది. ‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు, కృష్ణుడి శత్రువు కంశుడు, మరి నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ట్రైలర్ లో ఆది చెప్పే డైలాగ్ సినిమా కతఅంశం ఎలా ఉండబోతోందో తెలిసేలా ఉంది. ట్రైలర్‌ ఎండింగ్‌లో కమెడియన్‌ పృథ్వీ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఇటీవలె సాహో టీజర్‌ను కాపీ కొడుతూ పృథ్వీ చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌పై హెచ్‌.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా, అలానే సినిమా పై హైప్ పెంచే విధంగా సాగిందని చెప్పాలి. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగె చిత్రం అని అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో ఆదికి జోడిగా మిస్తీ చక్రవర్తి నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని హెచ్‌.కె.శ్రీకాంత్‌ దీపాల నిర్మిస్తున్నారు.