అక్షర : “రామ రామ” లిరికల్ వీడియో సాంగ్

499
Rama Rama Song Lyrical Video from Akshara Movie

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ “అక్షర”.

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బెనల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.

తాజాగా ‘అక్షర’ సినిమా నుంచి “రామ రామ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. స్వీకర్ అగస్తి ఈ సాంగ్ ను ఆలపించగా… చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు.

ఆహ్లాదకరంగా సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను ‘అక్షర’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఫిజిక్స్ చెప్పే టీచర్ అక్షర పాత్రలో నందితా శ్వేత కనిపిస్తోంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు.

కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు.

విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యింది అనే విషయాన్నీ సినిమాలో చూపించనున్నారు.