కపిల్ దేవ్ బయోపిక్ “83” విడుదల తేదీ ఫిక్స్

209
83 will hit the screens on June 4th 2021

భారత సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్ర‌ పోషిస్తున్నారు.

ఆయ‌న భార్య పాత్రలో బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది.

సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి,

క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణిగా సాహిల్‌ ఖట్టర్, బల్వీందర్‌ సింగ్‌గా అమ్మీ విర్క్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాయి.

ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవత్సరం వ‌ర‌ల్డ్ క‌ప్‌ సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బడింది.

దేశం గర్వించేలా ప్రపంచ కప్ సాధించి చూపించారు అప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్.

అలా ఇండియా చిరకాల స్వప్నం సాకారమైంది. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించేలా “83” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్ క‌బీర్ ఖాన్.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.