అల్లు అర్జున్ తదుపరి చిత్రం అప్డేట్

243
AA21 - Allu Arjun and Koratala Movie Update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. “పుష్ప” చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2021 ఆగస్టు 13న “పుష్ప” చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా ఈయన చేతిలో ఉన్నాయి. వరస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి వాటికి డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ.

ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్, కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇందులో ఐకాన్ సినిమా గురించిన అప్డేట్ లేదు.

కానీ కొరటాల శివ సినిమాను మాత్రం వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ.

కొరటాల ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.

“ఆచార్య” తర్వాత వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బన్నీ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు కొరటాల.

ఆగస్ట్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టి, 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.