
అమిత్ తివారీ, భానుశ్రీ ప్రధాన పాత్రధారులుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నల్లమల”. నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ‘నల్లమల’ సినిమాలో మొదటిసారిగా జానపద పాట పాడారు. తాజాగా ‘ఏమున్నవే పిల్లా’ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 13న విడుదల చేశారు. మీరు కూడా “ఏమున్నవే పిల్ల” వీడియోను వీక్షించండి.
అడవి చుట్టూ జరిగిన సామాన్య జనానికి తెలియని ఎన్నో చీకటి కోణాలను, అవినీతి ఒప్పందాలను తెర మీద ‘నల్లమల’ ద్వారా చూపించబోతున్నారు.
ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆర్.ఎమ్ “నల్లమల” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.