ప్రేమజంట ఆత్మహత్య

246
Engineering student commits suicide in college

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన జిల్లాలోని వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది.

మృతులు దేశాయిపేటకు చెందిన సాయి సతీష్(20), షకీనా(18)గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.