మాధవి సమర్పణలో ఎంటీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ “ఈ కథలో పాత్రలు కల్పితం”.
ఈ సినిమా ద్వారా కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. అభిరామ్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు.
మేఘన, లక్కి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కార్తీక్ కొడకొండ్ల సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ చిత్రంలోని “ఏమిటో ఏమిటో” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల విడుదల చేశారు.
లవ్ ఫీల్ తో ఉన్న ఈ సాంగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా నుంచి విడుదలవుతోన్న రెండో పాట ఇది.
కార్తీక్ కొడగండ్ల స్వరపరిచిన ఈ పాటను దీపు జాను, నూతన మోహన్ ఆలపించారు.
శ్రేష్ఠ సాహిత్యం అందించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.