నవ్వులు పూయిస్తున్న “జాతిరత్నాలు” టీజర్

290
Jathi Ratnalu Teaser Released

స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్‌లో కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం “జాతి రత్నాలు”.

ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

టీజర్లో మొదట్లో న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డం కన్పిస్తుంది.

సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని చెప్తాడు న‌వీన్‌.

రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. “జాతిరత్నాలు” కామెడీ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

ఇక మార్చి 11న “జాతిర‌త్నాలు” ప్రేక్షకుల ముందుకు రానుంది.