బిగ్ అనౌన్స్మెంట్ : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా

188
Ram Charan and Shankar join hands for a Pan-India film

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ “ఆర్‌ఆర్‌ఆర్”‘ తర్వాత చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చేసింది.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెరకెక్కనుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొంద‌నుందని అధికారికంగా ప్రకటించారు.

ఇక దర్శకుడు శంకర్ గతంలో జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు, ఇండియ‌న్‌, జీన్స్‌, ఒకే ఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

దీంతో తాజాగా చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా అని అధికారిక ప్రకటన రావడంతో అప్పుడే ఆసక్తి, ఆతృతతో పాటు అంచనాలు కూడా మొదలైపోయాయి.

రామ్ చరణ్‌ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.