ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి

451
Two killed in Bolero vehicle collision

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని ఆరోగ్యవరం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన

ధనుశ్‌‌(16), రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన తరుణ్‌కుమార్‌ రెడ్డి(16), శ్రీహరి (18) కలిసి ద్విచక్ర వాహనంపై ఓ వివాహ వేడుక కోసం తరిగొండ గ్రామానికి బయలుదేరారు.

రాత్రి కావడంతో వారి వాహనం ఆరోగ్యవరం వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన విద్యార్థులు వేర్వేరు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.