
బీపీఎన్ఎల్ (భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశావ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది.
ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 3216 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.
దరఖాస్తులు సమర్పించేందుకు ఫిబ్రవరి 15 చివరితేది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.
మొత్తం పోస్టులు: 3216, సేల్స్ మేనేజర్- 64, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 485, సేల్స్ హెల్పర్- 2667 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆయా పోస్టులకు విద్యార్హతలు: సేల్స్‌మేనేజర్ పోస్టులకు.. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సేల్స్ డెవలప్‌మెంట్ పోస్టులకు.. ఇంటర్, సేల్స్ హెల్పర్ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్ల లోపు.. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్. ఇందులో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పూర్తి వివరాలను https://www.bharatiyapashupalan.com/ వెబ్ సైట్ లో చూడవచ్చు.