‘వేరీజ్ ద వెంకటలక్ష్మీ’ టీజర్

371
where is venkata laxmi

రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారిగా ‘వేరీజ్ ద వెంకటలక్ష్మి’ సినిమా రూపొందుతోంది. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కమెడియన్స్ ప్రవీణ్ .. మధునందన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.
 

రాయ్ లక్ష్మి గ్లామర్ ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యూత్ ను థియేటర్స్ కి రప్పించేలా ఈ టీజర్ వుంది. గ్లామర్ విషయంలో రాయ్ లక్ష్మికి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ ఆమె గ్లామర్ ను మాత్రమే ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. మరి ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ప్రవీణ్ .. మధునందన్ లు ఈ సినిమాలోని పాత్రల ద్వారా మరో ముందడుగు వేశారనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ వాళ్ల కెరియర్ ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు వున్నాయి.