వాల్ట్‌ డిస్నీ సినిమా ‘ఫ్రోజెన్‌ 2’ ట్రైలర్‌ విడుదల

271
Walt Disney movie

వాల్ట్‌ డిస్నీ సంస్థ నుంచి వస్తున్న మరో యానిమేటెడ్‌ ఫాంటసీ చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. 2013లో వచ్చిన ‘ఫ్రోజెన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. క్రిస్‌ బక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

అరెండెల్‌ అనే రాజ్యంలోని చెట్లకు మాటిమాటికీ మంటలు అంటుకుంటూ ఉంటాయి. ఆ మంటలు విచిత్రంగా గులాబీ రంగులో ఉంటాయి. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు మహారాణి అయిన ఎల్సా దేన్నైనా ఐస్‌గా మార్చేసే తన శక్తుల్ని ఉపయోగిస్తుంది.

అసలు తనకు ఆ శక్తి ఎలా వచ్చింది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు తన సోదరి ఆన్నాతో కలిసి ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయలుదేరుతుంది ఎల్సా. ఆ తర్వాత ఏం జరిగింది?అన్నదే సినిమా కథ. నవంబర్‌ 22న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.