శ్రీహ‌రి కొడుకు హీరోగా రాజ్‌దూత్ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌

556
srihari son meghansh movie rajdooth

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా రాజ్‌దూత్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు . రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. నక్షత్ర, ప్రియాంక వర్మ నాయికలు. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్‌ని జీవిత చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా రషెస్‌ని చూసినప్పుడే మేఘామ్ష్‌లో శ్రీహరిని చూశా. చురుకైన నటన, నృత్యాలతో శ్రీహరిని మించి పేరు సంపాదిస్తాడ’’న్నారు. ‘‘మేఘామ్ష్‌తో రెండో చిత్రాన్నీ తీస్తాం’’ అన్నారు నిర్మాత. ఇందులో ప్ర‌ధాన పాత్ర ధారులు ఇద్ద‌రు ఆక‌ట్టుకున్నారు. కొత్త వాళ్ళు అయిన‌ప్ప‌టికి ఎంతో న‌ట‌నా ప్ర‌తిభ‌ని క‌న‌బ‌ర్చారు. జులైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ’’న్నారు. ‘‘నవరసాలతో కూడిన కథ ఇది’’ అన్నారు దర్శకులు. ఈ కార్య‌క్ర‌మానికి హాజరైన డిస్కోశాంతి త‌న కొడుకు తండ్రి పేరు నిల‌బెడ‌తాడ‌ని చెప్పుకొచ్చారు.

శ్రీహ‌రి కొడుకుతో రాజ‌శేఖ‌ర్ కుమార్తె

హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా రంగ ప్ర‌వేశం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం `రాజ్‌దూత్‌` పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుద‌ల కాక ముందే మేఘాంశ్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మైంది. `రాజ్‌దూత్‌` చిత్రాన్ని నిర్మిస్తున్న ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణే, మేఘాంశ్ నెక్ట్స్ మూవీని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత రెండో త‌న‌య శివాత్మిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. కొస‌మెరుపు ఏంటంటే జీవిత‌, రాజ‌శేఖ‌ర్ మొద‌టి కుమార్తె శివాని రాజ‌శేఖ‌ర్ న‌టించిన `2స్టేట్స్‌` సినిమాకు కూడా పి.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణే నిర్మాత‌.