విజయ్ దేవరకొండ “లైగర్” రిలీజ్ డేట్ ఫిక్స్

166
Vijay Deverakonda's Liger to Release on September 9

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “లైగ‌ర్”.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా “లైగర్” రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు ‘లైగర్’ కొత్త పోస్టర్ షేర్ చేసిన ఛార్మి ‘సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి మీ దగ్గర్లోని థియేటర్స్‌లో పంచ్ ప్యాక్’ అని పేర్కొన్నారు.

మరోవైపు విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా ‘డేట్ సెట్టయింది.. మేము ఇండియా వచ్చేస్తున్నాము’ అని ప్రకటించారు.

ఇక కొత్త పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ హై వోల్టేజ్ పంచ్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.