వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్!

150
Central Govt.Good News for Motorists

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో “ఫాస్టాగ్’” నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది.

వ్యాలెట్‌లో కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఫాస్టాగ్ ఖాతాలో కనీస నిల్వ ఉంటేనే టోల్ ప్లాజాల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు.

దీంతో అక్కడ అనవసర రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించే ఉద్దేశంతో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రభుత్వ తాజా ప్రకటనతో ఫాస్టాగ్‌లో కనీస మొత్తం లేకున్నా అనుమతిస్తారు. ఆ మొత్తాన్ని ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు.

వాహనదారులు ఆ తర్వాత చెల్లించే టోల్ ఫీజు చెల్లించే విషయంలో దీనిని కూడా కలుపుతారు.

కాగా, ప్రస్తుతం 80 శాతం వరకు టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి.