ప‌వ‌న్‌కళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్ విడుదల

219
Vakeel Saab Teaser released

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ న‌టిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ క‌పూర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. హిందీ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. ఈ సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు, ప్రేకకులకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

లాయర్ వేసుకునే కోటుని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేసుకోవ‌డంతో మొద‌లైన టీజ‌ర్‌. ఆయ‌న పుస్త‌కాల‌ను మూసి ఉంచిన క‌వ‌ర్‌ను తొల‌గించ‌డం, సీరియ‌స్‌గా కోర్టులో డైలాగ్ చెప్ప‌డం.. అలాగే త‌నని క‌త్తితో పొడ‌వ‌డానికి వ‌చ్చిన విల‌న్స్‌ ని చిత‌క‌బాద‌డం.. వంటి మాస్ స‌న్నివేశాల‌తో పాటు.. చివ‌ర‌లో త‌న ల‌గేజీతో ట్రావెల్ చేస్తుండడం అందరిని అలరించింది. బ్యాగ్రౌండ్ లో స‌త్య‌మే జ‌య‌తే.. అనే ప‌దానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుంది. టీజ‌ర్ ప‌క్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. త‌మ‌న్ త‌న‌దైన స్టైల్లో సూప‌ర్బ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. ఇక సినిమాను ఎప్పుడు చూద్దామా అని అనిపించేలా సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చారు. సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.