“ఉప్పెన” వసూళ్లు… నాలుగో రోజు ఇంకా కూడా తగ్గని జోరు

183
Vaishnav Tej's Uppena Four Days Collections

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన “ఉప్పెన” చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై అంచనాలను అందుకుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.

థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టింది. ఒక డెబ్యూ హీరో బెస్ట్ ఓపెనింగ్‌ కలెక్షన్ ఇదే.

ఈ సినిమా శని, ఆదివారాల్లో కూడా బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్, రూ.28.29 కోట్ల షేర్ రాబట్టింది.

కూడా ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు పైగా.. వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఉప్పెన.

4 రోజుల కలెక్షన్స్ :
నైజాం : 9.46 కోట్లు

సీడెడ్ : 4.42 కోట్లు

ఉత్తరాంధ్ర : 5.02 కోట్లు

ఈస్ట్ : 2.90 కోట్లు

వెస్ట్ : 1.75 కోట్లు

గుంటూరు : 1.94 కోట్లు

కృష్ణా : 2.01 కోట్లు

నెల్లూరు : 1.1 కోట్లు

ఏపీ – తెలంగాణలో 4 రోజుల మొత్తం : 28.23 కోట్లు షేర్ (48.80 కోట్లు గ్రాస్)

కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 90 లక్షలు

ఓవర్సీస్ – 1.02 కోట్లు

వరల్డ్ వైడ్ 4 రోజుల మొత్తం – 32.15 కోట్లు షేర్ (56.30 కోట్లు గ్రాస్)