నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

157
Nagarjuna's Action Thriller with Praveen Sattaru begins today

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నాగార్జున కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్స్‌పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

‘పిఎస్‌వి గరుడవేగ’తో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు.

పాన్‌ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సోమవారం పూర్తి చేసుకున్న నాగార్జున, మంగళవారం.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “నిన్న‌నే హిందీ సినిమా బ్రహ్మాస్త్ర` షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చాను.

ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో నా సినిమా ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. ఈ టెంపుల్‌కి రావ‌డం ఇదే మొద‌టిసారి. చాలా ప‌వ‌ర్‌ఫుల్ టెంపుల్ ఎన్నో సంవ‌త్స‌రాల‌నుండి ఉంది.

టైటిల్ ఇంకా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి చాలా రోజులు అయింది.

హైద‌రాబాద్, లండ‌న్‌, ఊటీ, గోవా‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు” అని తెలిపారు.

ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.