V6 తీన్ మార్ వార్తలు – అల్కగ గెలుస్తరట ఎమ్మెల్సీ సీట్లు

316
V6 teenmaar news
  • అల్కగ గెలుస్తరట ఎమ్మెల్సీ సీట్లు – మరెందుకో మంత్రులకు గిన్ని పాట్లు
  • కొలువుల మీద ట్విట్టర్ల ఫైటింగ్ – ఓయూ ల రామన్న కోసం వెయిటింగ్
  • టి ఆర్ ఎస్ ల చేరితే పథకాలు – సభ్యత్వం కోసం బెదిరింపులు
  • పబ్లిక్ ల కచ్చింది కరోనా టీకా – ఎస్కుంటే ఉండదట డోకా
  • పెద్దగట్టు జాతర షురూ – మూడు రోజులుంటది జోరు

తీన్మార్ వార్తలు

అల్కగ గెలుస్తరట ఎమ్మెల్సీ సీట్లు :  వుత్తగానే గెలుస్తాం , రెండు ఎమ్మెల్సీ సీట్లు మనయే …గవర్నమెంట్ మీద వ్యతిరేకత శానా తగ్గింది అని మంత్రుల మీటింగ్ ల అన్నాడాట సీఎం సారు..

ప్రగతి భవన్ ల కెళ్ళి నేను అంత సూస్కుంట మీరేం ఫికర్ పడకుర్రి అని దైర్యం సెప్పిండాట.

కొలువుల మీద ట్విట్టర్ల ఫైటింగ్ : మొన్న కాంగ్రెసోళ్లు అమరవీరుల స్తూపం కాడ కుర్చేస్తే , ఇయ్యాల ఉస్మానియా యూనివర్సిటీల బీజేపీ వాళ్ళు కుర్చేసిల్లు రామన్నకు.

ఎంత సేపు వెయిటింగ్ చేసిన ఎవ్వల్ రాలే ..

ఏమైంది ఇంకా వస్తలేవని కేటీఆర్ సార్ ట్విట్టర్ అకౌంట్ కు అంటూవెట్టుకుంటా రాసిండు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రావు సారు.పిట్టగూట్లయితే తప్పకుండా సూస్తాడని ఈ సారు అన్నట్టుగానే ఆ సారు సూసిండు.

టి ఆర్ ఎస్ ల చేరితే పథకాలు : రేపు రాబోయే రోజులల్ల పెన్షన్ గాని, రేషన్ కార్డులు గాని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని రావాలన్నపుడు విధిగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వముండాలి, టిఆర్ఎస్ ల చేరకుంటే ఇయ్యమని ఖరాఖండిగా చెప్పేసిండు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సారు.

మొన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సారు గూడా బాజాప్త ఇదేమాట అన్నడు.

పబ్లిక్ ల కచ్చింది కరోనా టీకా : మొత్తానికైతే మోడీ సారు కూడా కరోనా టీకా ఎస్కుండు. ఢిల్లీల పెద్ద దవాఖానకు పొయ్యి భారత బయోటెక్ కంపినోళ్లు తయారుజేసిన కొవాక్సీన్ టీకా తీసుకున్నాడు ప్రధానమంత్రి సారు. 28 రోజులయినంక 2 వ డోసు ఇస్తరిగా ..

60 ఏండ్లు నిండినోళ్లకు ఇయ్యాల్టిసంది వాక్సిన్ ఇస్తున్నారు. అట్లనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు గూడా వాక్సిన్ ఏస్కున్నాడు ఇయ్యాల.