ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ రోజు ఆ సంఖ్య సగానికి తగ్గింది.
రాష్ట్రంలో సోమవారం కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 51 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 8,89,974 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,82,080 చికిత్సకు కోలుకున్నారు.
మరో 725 మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ భారీనపడి 7169 మంది మృత్యువాతపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 20,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 1,39,74,400 మందికి పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.