కోడిగుడ్ల పెంకులను పడేస్తున్నారా?

346

కొడి గుడ్డును కూర చేసినా.. ఆమ్లెట్ వేసుకున్నా.. ఇంకేర‌కంగా ఉప‌యోగించుకున్నా పెంకుల‌ను ప‌డేయ‌డం కామ‌న్ ఎందుకంటే వాటి వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి ఉప‌యోగ‌మూ ఉండ‌దు.

ఆ.. ఆ.. ఒక విష‌యం గుర్తు కొచ్చింది. బ‌ల్లులు ఎక్కువ‌గా తిరిగే చోట ఈ కోడి గుడ్డు పెంకులు పెడితే బ‌ల్లులు ఆ చుట్టు ప‌క్క‌ల ఉండ‌వ‌ని మా అమ్మ చెప్పేది.

కానీ ఇక్క‌డ మ్యాట‌ర్ అది కాదు. కోడి గుడ్డు పెంకులతో చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంట‌. అవేంటో తెలిస్తే ఎన్న‌టికీ వాటిని ప‌డేయ‌రు.

పెంకుతో ఏం ఉపయోగముంటుందని కొట్టిపారేయ‌కండి. కోడిగుడ్డు పెంకులను నేరుగా తినడం కష్టమే. అలా తింటే కడుపులో గుచ్చుకుని చనిపోయే ప్రమాదం ఉంది.

కానీ ఆ పెంకులను శుభ్రంగా కడిగి ఒకరోజంతా ఎండబెట్టిన తర్వాత నీటిలో వేసి మరిగించాలి.

బాగా మరిగిన తర్వాత ఆరబెట్టి.. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పిండి అయ్యే వరకూ ఉంచాలి.

పౌడర్‌లా అయిన తర్వాత దాన్ని రెండు టీస్పూన్లు తినాలి. అలా రోజూ రెండు స్పూన్లు తిన‌డం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.

గుడ్డు పెంకులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం మన శరీరంలోని ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. పళ్లు దృఢంగా అవ్వడానికి సహకరిస్తుంది.

అంతేకాదు ఈ పొడి సులభంగా అరుగుతుంది కూడా. అంతేకాదు ఈ పౌడర్‌ను ఫేస్ ప్యాక్‌లా కూడా వాడుకోవచ్చట.

దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. నల్లగా ఉన్న వారు రంగు రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుందట.

కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు ఇది తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చట. నరాల బలహీనత వల్ల శృంగారంలో సంతృప్తి పొందలేకపోతున్న వారు దీన్ని తింటే చాలట.

సెక్స్ చేయడానికి కొద్ది గంటల ముందు ఈ పెంకుల పొడిని పాలల్లో కలుపుకుని తాగితే ఆశించిన ఫలితం ఉంటుందట.

భావప్రాప్తి ఆశించినంత పొందడం లేదని భార్య బాధ పడటం గానీ, భార్యకు ఎలాంటి పాడు ఆలోచనలు గానీ రావట.

మార్పు కొద్దిరోజుల్లో తప్పకుండా కనిపిస్తుందట. ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలియక వందకు 99 శాతం మంది కోడి గుడ్డు పెంకలను చెత్తకుండీల్లో పడేస్తుంటారు.