మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన “ఉప్పెన” చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై అంచనాలను అందుకుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ నిన్నటి వరకు టాలీవుడ్‌లో అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన ఒక డెబ్యూ హీరో సినిమా. ‘చిరుత’ తన లైఫ్ టైమ్ రన్‌లో వసూలు చేసిన మొత్తాన్ని పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ తొలి వారంలోనే దాటేయడం విశేషం.
తాజాగా ‘ఉప్పెన’ ఇప్పుడు ఆల్ ఇండియా రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసింది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ నిలిచింది.
భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది. ఈ రికార్డు గతంలో హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ పేరిట ఉంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది.
అయితే, ‘ఉప్పెన’ ఐదు రోజుల్లోనే రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ‘కహో నా ప్యార్ హై’ రికార్డును తిరగ రాయడం విశేషం.
కాగా “ఉప్పెన” ఐదో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.92 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లో “ఉప్పెన” ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ మొత్తం రూ. 37.39 కోట్లకు చేరుకుంది.
ప్రాంతాల వారీగా కలెక్షన్ వివరాలు :
నైజాం – రూ. 11.03 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.59 కోట్లు
సీడెడ్ – రూ. 5.17 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 3.23 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 1.91 కోట్లు
కృష్ణా – రూ. 2.2 కోట్లు
గుంటూరు – రూ. 2.65 కోట్లు
నెల్లూరు – రూ. 1.14 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 32.92 కోట్లు
ఓవర్సీస్ – రూ. 1.6 కోట్లు
కర్ణాటక – రూ. 1.71 కోట్లు
తమిళనాడు – రూ. 65 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 51 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: రూ. 37.39 కోట్లు