భారీ రేటుకు అమ్ముడైన “ఉప్పెన” డిజిట‌ల్ రైట్స్

297
Uppena First Day Collections

బుచ్చిబాబు సానా దర్శకుడిగా పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన చిత్రం “ఉప్పెన”.

ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఉప్పెన మూవీ ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే దిశగా పరుగులు పెడుతోంది.

అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రాన్ని త‌మిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం డిజిట‌ల్ రైట్స్ 7 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయిన‌ట్టు సమాచారం. “ఉప్పెన”ను ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయనున్నారని తెలుస్తోంది.

ఇక “ఉప్పెన”పై విమర్శకులతో పాటు సెలెబ్రిటీల ప్రశంసలు కూడా కురుస్తున్నాయి.భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ చిత్రంపై బాలకృష్ణ, మహేష్ బాబు, చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.

70 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, కథ, బుచ్చిబాబు దర్శకత్వం, పాటలు ఈ ‘ఉప్పెన’ సినిమా విజయవంతం కావడానికి బాగా దోహదపడ్డాయి.