స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లే దానికి అడ్డా

218

క‌రోనా వైర‌స్ అనేక రూపాల్లోకి మారింది. దీంతో అది పూర్తిగా అంత‌రించి పోలేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ వైర‌స్ ప్ర‌భావం కాస్త త‌గ్గిందిలే అని ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలో మ‌రోసారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఒక్కో ఉపరితలంపై కొన్ని గంటల పాటు ఉంటుంది.

ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం వంటి అనేక అంశాలపై కరోనా వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇతర ఉపరితలాలతో పోలిస్తే.. స్మార్ట్ ఫోన్ స్ర్కీన్లపై ఉండే కరోనా వైరస్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైందని అంటున్నారు నిపుణులు.

తుంపర్ల ద్వారా స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై తిష్టవేసే కరోనా వైరస్ చాలా సుల‌భంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ స్ర్కీన్ పై కరోనా ఎక్కువ గంటలు జీవించే అంకాశం ఉందని అధ్యయనంలో తేలింది.

ఇతర స్ర్కీన్లపై కంటే.. ఫోన్ స్ర్కీన్లపైనే మూడు రెట్లు అధిక సమయం ఉంటుందని రుజువైంది. ఎందుకంటే ఫోన్‌ స్ర్కీన్‌ మీద తడి త్వరగా ఆరిపోదు. అది ఆరడానికి కొంత సమయం పడుతుంది.

తుమ్మినా లేదా ద‌గ్గినా వైరస్ సంబంధిత నోటి తుంపర్లు సేపు స్ర్కీన్ పై ప‌డి అవి ఎక్కువ అలానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నానోలీటర్‌ పరిమాణం ఉన్న తుంపర ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది.

10 నానోలీటర్ల పరిమాణం ఉన్న నోటి తుంపర ఆరిపోయేందుకు 50శాతం చ‌ల్ల‌ని వాతావరణంలో 15 నిమిషాల సమయం పడుతుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో తుంపర్లు ఆరేందుకు దాదాపు గంట సమయం తీసుకుంటుంద‌ని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.

సాధారణ ఉష్ణోగ్రత, చల్లని వాతావరణం, ఉపరితల పరిమాణం ఆధారగా తుంపర్లలో ఉండే వైరస్‌ ఎంతకాలం జీవించి ఉంటుందనేది నిర్ధారించవచ్చు. తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్లపై తుంపర్లు ఎక్కువసేపు జీవించి ఉంటాయి.

దీంతో కరోనా వైరస్‌ సజీవంగానే ఉంటుందని అధ్యయనంలో తేలింది. అందుకే ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.