యాంకర్ అనసూయకు ఓ స్టార్ హీరో సరసన నటించే బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరిస్తున్న అనసూయకు తాజాగా మలయాళ ఇండస్ట్రీ భారీ ఆఫర్ వచ్చిందట.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను సెలక్ట్ చేశారని సమాచారం.
ఈ రోల్ నచ్చడంతో అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. గతంలో మమ్ముట్టి తెలుగులో నటించిన ‘యాత్ర’ చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించింది.
మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే, అది కూడా మలయాళీ తెరపై కనిపించే ఛాన్స్ రావడం నిజంగా అనసూయ అదృష్టం.
మరోవైపు యాంకర్ అనసూయ ప్రస్తుతం కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది.
అంతేకాదు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది అనసూయ.
ఇంకా ఆచార్య, పుష్ప, ఖిలాడీ, పక్కా కమర్షియల్ చిత్రాల్లో ఆమె భాగమవుతోందట. ఏదేమైనా వెండితెరపై ప్రస్తుతం అనసూయ జోరు బాగానే నడుస్తోంది.