“ఉప్పెన”లా వసూళ్లు… సరికొత్త రికార్డు సృష్టించిన వైష్ణవ్ తేజ్

316
Uppena First Day Collections

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన “ఉప్పెన” చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై అంచనాలను అందుకుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది ఉప్పెన.

ఫస్ట్ డే ఉప్పెన చిత్రానికి నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.10.42 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా రికార్డుల కెక్కాడు.

తొలిరోజు రూ. 10.42 కోట్లు రాబట్టింది అంటే మిగతా రెండు మూడు రోజుల్లోనే ‘ఉప్పెన’ బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలను లాభాల బాట పట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా శని-ఆదివారాలు రావడంతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటం “ఉప్పెన”కు కలిసొచ్చే అంశాలు.

వసూళ్ల వివరాలు :
నైజాం.. రూ.3. 08 కోట్లు
వైజాగ్ రూ. 1. 43 కోట్లు
ఈస్ట్ రూ. 0.98 కోట్లు
వెస్ట్ రూ. 0.81 కోట్లు
క్రిష్ణా రూ. 0.62 కోట్లు
గుంటూరు రూ. 0.65 కోట్లు
నెల్లూరు రూ. 0.35
టోటల్ ఆంధ్రా రూ. 4. 87 కోట్లు
సీడెడ్ రూ. 1. 35 కోట్లు
మొత్తం : రూ.10.42 కోట్లు