యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “గని”. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది.
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో వరుణ్ బాక్సార్‌గా కనిపించనున్నారు.
మెగా వారసుడు వరుణ్ తేజ్‌ని ఢీ కొట్టేందుకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఏంటి అర్థంకాలేదా..? అదేనండీ.. వరుణ్ తేజ్ హీరోగా ఆయన కెరీర్‌లో 10వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ‘
తాజాగా ‘గని’ సెట్స్ పైకి వచ్చేశారు రియల్ స్టార్ ఉపేంద్ర. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు గాను ఉపేంద్ర హైదరాబాద్ చేరుకున్నారు.
Real Star @nimmaupendra Joins the shoot of Mega Prince @IAmVarunTej ‘s #Ghani 🥊
Currently, 2nd Schedule is in Progress @ Hyderabad.@SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/huzN2TuokI
— BARaju (@baraju_SuperHit) February 18, 2021
ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన ఆయన సెకండ్ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
కాగా ముందుగా ఈ చిత్రాన్ని జులై 30 విడుదల చేయాలని భావించిన దర్శకనిర్మాతలు.. అదే రోజు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్న నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.