“మ‌ను చరిత్ర” ఫస్ట్ లుక్ విడుదల

151
Stunning First Look of Manu Charitra

శివ కందుకూరి హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం “మ‌ను చరిత్ర”‌. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది.

యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపి సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ రోజు శివ కందుకూరి బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ చిత్రం నుండి ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు.

ఇందులో శివ కందుకూరి గుబురు గ‌డ్డంతో నోట్లో సిగ‌రెట్‌, చేతిలో పువ్వు ప‌ట్టుకొని బైక్ నడుపుతూ సీరియ‌స్ గా కనిపిస్తున్నాడు.

పోస్ట‌ర్‌లో శివ‌ను చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు వస్తోంది.

ఇక వ్యాలంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి క‌లిగించింది.

“పెళ్ళి చూపులు” నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడే శివ కందుకూరి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమా త‌ర్వాత కాజ‌ల్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాత‌గాను రాణించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది.