చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా “లూసిఫర్” తెలుగు రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే.
శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
=ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి లాంచ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే తాజాగా సినిమా హీరోయిన్ గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నయనతార నటిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా స్టార్ హీరోయిన్ నయన్ తన డేట్స్ అందుబాటులో లేవని చెప్పడంతో త్రిషను సంప్రదించిందట చిత్రయూనిట్. ఈ సినిమాకు త్రిష వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అతి త్వరలో “లూసిఫర్” రీమేక్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మొదట చిరంజీవి- త్రిషలపై సన్నివేశాల చిత్రీకరణనే జరుపుతారట.
కాగా చిరంజీవి ‘ఆచార్య’లోనే త్రిష నటించాల్సింది. కానీ చివరి నిమిషం డ్రాప్ కావడంతో ఆమె స్థానంలో కాజల్ నటిస్తోంది.