విశ్వక్ సేన్ “పాగల్” టీజర్

271
The Teaser of Vishwak Sen's Paagal

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “పాగల్”. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు.

తాజాగా “పాగ‌ల్” చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఇందులో విశ్వక్ సేన్ రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు కోపంగానూ క‌నిపిస్తున్నాడు.

టీజర్ చివర్లో విశ్వక్ సేన్ తో రాహుల్ రామకృష్ణ చేసిన కామెడీ నవ్విస్తుంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

మ్యాజికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న “పాగ‌ల్”‌ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.