నేడు నాలుగు గంటలపాటు దేశవ్యాప్త రైలు రోకో

125
Today four hours nationwide train roko

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనలో భాగంగా రైతులు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నాలుగు గంటలపాటు దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టనున్నారు.

ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సిద్దమవుతోంది. రైల్‌రోకో నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్పీఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోహరించింది.

ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాన, పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేక దృష్టిసారించింది.

శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు.