తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు.
అయితే ఆయన ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను కవర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు.
సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు.
అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్యక్తులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
View this post on Instagram
అజిత్ కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం చేశారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న అజిత్ ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
‘వలిమై’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా అజిత్ కనిపించనున్న ఈ మూవీని 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.