తెలంగాణ సదరన్ పవర్‌లో ఏఈ, జేఏవో ఉద్యోగాలు

456
telangana-southern-power-tsspdcl-recruitment-2018

విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ పరంపర కొనసాగుతున్నది. ఇటీవలే ట్రాన్స్‌కోలో వెయ్యి పోస్టులకుపైగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం సదరన్ పవర్‌లో 267 కొలువులకు ప్రకటన వచ్చింది. ఏఈ, జేఏవో పోస్టుల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా…



టీఎస్‌ఎస్‌పీడీసీఎల్: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల కరెంట్ పంపిణీ అంశాలను ఈ కంపెనీ చేపడుతుంది.
అసిస్టెంట్ ఇంజినీర్ – 153 ఖాళీలు. విభాగాల వారీగా…
  1.  ఎలక్ట్రికల్ – 133 (దీనిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ – 9, జనరల్ రిక్రూట్‌మెంట్ – 124)
  2.  సివిల్ – జనరల్ రిక్రూట్‌మెంట్ – 20 ఖాళీలు ఉన్నాయి.
  3.  వయస్సు: 18-44 ఏండ్లు
  4.  పేస్కేల్: 41155-1700-44555-1985-54480-2280-63600
  5.  అర్హతలు: సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
  6.  నోట్: సదరన్ పవర్ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు లోకల్ వేకెన్సీలకు అర్హులు. ఇతర జిల్లాల అభ్యర్థులు ఓపెన్ కోటా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  ఎంపిక ఎలా?
  •  రాతపరీక్షలో 100 ప్రశ్నలు – 100 మార్కులు. రెండు సెక్షన్లు ఉంటాయి.
  •  సెక్షన్- ఏలో 80 ప్రశ్నలు సంబంధిత బ్రాంచీపై ఇస్తారు. సెక్షన్- బీలో 20 ప్రశ్నలను జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీపై ఇస్తారు.
  •  పరీక్ష కాలవ్యవధి 2 గంటలు
పరీక్షతేదీ : ఏఈ ఎలక్ట్రికల్, సివిల్- మార్చి 25.
పరీక్ష కేంద్రాలు
  •  జీహెచ్‌ఎంసీ పరిధిలో
  •  శిక్షణ, ప్రొబేషన్ పీరియడ్: మొత్తం రెండేండ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దీనిలో ఏడాది శిక్షణ ఉంటుంది. సదరన్ పవర్ పరిధిలో పోస్టింగ్‌లు ఇస్తారు.


ముఖ్యతేదీలు:
  •  ఫీజు చెల్లింపు ప్రారంభం: ఫిబ్రవరి 1
  •  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 2
  •  ఫీజు చెల్లింపునకు చివరితేదీ: ఫిబ్రవరి 19
  •  దరఖాస్తు చివరితేదీ: ఫిబ్రవరి 19
  •  హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: మార్చి 15 నుంచి
  •  వెబ్‌సైట్: www.tssouther-power.com

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 114 ఖాళీలు . ఓపెన్ కోటాలో – 34, లోకల్ – 80 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ప్రథమశ్రేణిలో బీకాం లేదా ఎంకాం ఉత్తీర్ణత లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ – ఇంటర్ ఉత్తీర్ణత. వయస్సు 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ఎలా?

రాతపరీక్ష ద్వారా.
రాతపరీక్ష 100 ప్రశ్నలకు – 100 మార్కులు. సెక్షన్ – ఏలో కోర్ సబ్జెక్టుపై 80 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ – బీలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీపై 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు.

పరీక్షను మార్చి 25న నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

పేస్కేల్: 34630-1425-36055-1700-44555-1985-54480-2280-56760

శిక్షణ, ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు ప్రొబేషనరీ పీరియడ్. దీనిలో ఏడాది శిక్షణా కాలంగా పరిగణిస్తారు.