పుస్తకం భావ వ్యక్తీకరణకు ప్రధాన వారధి – వారాల ఆనంద్

460
hyderabad-book-fair

హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీజిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు.ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది.పుస్తకం ఒక జ్ఞాననిధి. అనుభవాల గది, అనుభూతుల సారధి. భాషకు, భావానికి, వ్యక్తీకరణకు అది ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. అంతటి విలువగల పుస్తకాన్ని, దాని అవసరాన్ని, చదివే సంస్కృతిని పెంపొందించేందుకు గాను పుస్తక ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర గొప్పది. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాల ను, ఉద్యమాలను, ఉద్వేగాలను ఒకటేమిటి మనిషి సమస్త మార్పులను పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాం టి పుస్తకాలు అనేకమందికి చేరడం, విస్తృతంగా చదువడం అవసరం. ఆ అవసరాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ పూర్తిచేస్తున్నది. లక్షలాదిమంది పుస్తక ప్రదర్శనకు రావడమే కాకుండా పుస్తకాల అమ్మకాల పరిస్థితి చూస్తుంటే పుస్తకాల భవిష్యత్తు మీద చదివే అలవాటు మీద గొప్ప ఆశలు ముప్పిరిగొంటున్నాయి. ఎంతో ఆశావహమైన స్థితి కనిపిస్తున్నది. పుస్త కాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిదన్నట్టు ఇండ్లల్లోకి పుస్తకాలు చేరి తే చదువడం తప్పకుండా అలవాటవుతుంది. పుస్తక విక్రేతలు చెబుతున్నదాని ప్రకారం ఊహించనివిధంగా లక్షలాది రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సందర్శకుల సంఖ్య పెరుగుతున్నది. అంటే జనం లో చదివేవాళ్లు ఉన్నారు కానీ, వారికి వాటిని అందించడంలోనే వైఫల్యాలున్నాయన్నది ఇప్పుడు రుజువవుతున్నది.

భారతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఆచార్య రంగనాథన్ చెప్పినట్టు పుస్తకాలు ఉపయోగపడాలి. ప్రతి పుస్తకం తన చదువరిని చేరాలి, ప్రతి చదువరీ తన పుస్తకాన్ని చేరాలి అట్లా పుస్తకాల పరిధి విస్తృతమై అందరిని చేరగలిగినప్పుడు అవి సార్థకమవుతాయి. వాటి లక్ష్యమూ నెరవేరుతుంది. ఆ పనిని ముఖ్యంగా పౌర గ్రంథాలయాలు, విద్యాసంస్థ ల్లో ఉండే గ్రంథాలయాలూ నెరవేర్చాలి. కానీ పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు పుస్తకాలను పూర్వపక్షం చేస్తున్నాయి. పుస్తక పఠనం తగ్గిపోవటం మంచి పరిణామం కాదన్నది నిజం.

21వ శతాబ్దంలో ఆధునిక తరం చదివే సంస్కృతి నుంచి వెరైపోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుం చి ఒక్క చదివే అలవాటు మినహా అన్ని అలవాట్లు పెరిగాయి. అంతా చూడటమే. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు. స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్ని చూడటమే. దీనికి చిన్న పిల్లల నుంచి మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికి, చదువడానికి కూడా ఇమేజ్‌లనే వాడే సం స్కృతి వచ్చింది. ఒక మంచి పుస్తకం చదువుతూ గుండెల మీద ఉంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం నేటి తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే.

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. పుస్తకం హస్తభూషణం అన్న స్థితి నుంచి నేడు పుస్తకం పురావస్తువు అయిపోయే స్థితి కనిపిస్తున్నది. ఇవ్వాళ పుస్తకం చదువడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాం కులు సాధించడానికి పరిమితమైపోతుండగా, పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదువడమే మనకు కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం, సామాజిక రంగంలో వేళ్లూనుకుంటున్న సం క్లిష్టతలను, మానసిక సంక్షోభాలను ఆవిష్కరించిన పుస్తకాలను చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తిగత సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకూ అవకాశం కలుగుతున్నది.

ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ ఉంటుంది. నేటి సాంకేతికత కూడా తాత్కాలికం గా పుస్తకాన్ని మరుగునపరిచినట్టు కనిపించినా దాన్ని సరైనదిశలో విని యోగించగలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవ చ్చు. కాని భాషను, భావాలను మింగేయలేదు. చదువడం అనే ప్రక్రియ కు సంబంధించి పాఠకుల అలవాటు పేజ్ రీడింగ్ నుంచి స్క్రీన్ రీడింగ్‌కు మారింది. కానీ ఆ స్థితిని ఎట్లా సరైన దిశలో మార్చుకోవాలో ఆలోచించాల్సి ఉన్నది.సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనబెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాల్సి ఉన్నది. పుస్తకాలు చదు వడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించా లి. అది ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్ల్లో జరుగాలి. లైబ్రరీల ను ఈ గ్రంథాలయాలు, డిజిటల్ గ్రంథాలయాలు అంటూ ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థు ల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరుగాలి. చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులు, గ్రంథాలయాలు వేదిక కావాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికే కాకుండా ఆలోచనల్లో విశాలత్వం పెంచుకోవడానికి, సామాజిక బాధ్యతను గుర్తెరుగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదువాలని టీచర్లు చెప్పాలి. అప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది. పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.

గ్రంథాలయాల సేవలు ఎప్పటికప్పుడు విస్తరించాలి. గ్రంథాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలిపే పుస్తక పరిచయ సభలు, ముఖాముఖి కార్యక్రమాలు, రీడ్ అండ్ రివ్యూ కింద పుస్తక సమీక్ష సభలు, పోటీలు ఏర్పాటుకావాలి. అలాగే దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధానాంశంగా తీసుకొని ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు, సుప్రసిద్ధ రచనల దృశ్యరూపాల ప్రదర్శనలు ఏర్పాటుచేయాలి. సాక్షరతా మిషన్ లాగా లైబ్రరీ మిషన్, రీడర్‌షిప్ మిష న్ చేపట్టాలి. ఆ క్రమంలో హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పా టు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు. ఉత్తమ విలువ ల సమాజం ఏర్పడుతుంది.

Courtesy: By Varala anand garu, Source link

A book that gives wisdom is for generations – Varala anand

Hyderabad book fare is a great thing set up in all the major centers of Telangana State. Telangana, to fulfill its obligation, if such a demonstration can be made readers will become more effective. Information can be made available, but there are good results if you can have the reading habit. Best values in the Society are formed,Responsible citizens are made with book reading.

The book is knowledge provider, the room of experiences, the feel of the senses. It is the main bridge for language, sense, expression. A book that gives wisdom is for generations to generations. Book exhibits are designed to enhance the valuable book, its need, and the reading culture. The role played by the book in human life is cultural evolution was great. The book stands as a testimony to the transformation of feelings in the hundreds of languages ​​of the world, movements and emotions to the whole man. Alumni books need to be read and widely read. That requirement is complete in Hyderabad book fair. Millions do not come to the bookshop and look at the sales of books selling great hopes on the habit of reading the future of books. There is a very positive level. House that do not have books are like a room without windows. According to book sellers, millions of books are being sold because people are reading. The number of visitors is growing. It is now proven that people have readers but they have failed to provide them.

The books should be used as per the words of Acharya Ranganathan, the pitamaha of Indian Library. Each book should reach its reader, and each reader will have to join his book so that the books range widely reachable when they reach everyone. Their goal will be fulfilled. The work should be fulfilled, especially in libraries and educational institutions. But the increased technology, the modern electronic equipment books, It is true that the shortening of book reading is not good.

In the 21st century, a modern generation reading culture is approaching the culture of seeing. Especially since the last decade since childhood, all habits have increased. That’s all including watching TV, watching the movie, watching the computer. Toys are more used to watch videos than smart phone. This is what one looks at all. This is the beginning of a small child and everyone is getting used to seeing this. To write letters and read, there is also a sculpture of images. It is sad to note that today’s generation is not aware of a good book reading to the heart and sleeping on it.

The famous Urdu poet Gulzar wrote that the fragrance of floral fragrances found in the pages of the book, the book slipped, and the words of the book swapping, the love bonds that are formed. It’s a poet suffering from the decline of book priority in modern times. The book is now open to the status of archaeological excavations. The book that reads is that the marks in the schools are limited to rank rankings, while reading for competitive examinations in the civic libraries is visible to us. As a result, the number of readers reading the books of humanity, the complexity of the social sector, and the mental crises invented is decreasing. As a result, the lack of personal social complexity is a cause for many inadequacies.

The argument that technology, the Internet, and the social media is the reason for this condition. Even today’s technology seems to be temporarily hidden from the book, but it can be properly researched if it is physically presenting the book of technology. But the language and feelings are not swallowed. Readers’ habitually changed from page reading to screen reading for a process of reading. But it is to think about how to change that position in the right direction.

The technology has to deal with the consequences of how much the reading habit should be raised. It is important to understand the individual evolution and growing awareness of the books. Do you understand the happiness of reading a good book and digging into the mind? It should be done especially in schools and colleges. While libraries are accessible to modern libraries, such as libraries and digital libraries, programs that promote reading and reading among students and young adults should take place. To develop the culture of reading it needs basics of class rooms and libraries. Teachers should say that the exams do not only contain more marks in the exams but also increase the intellectual ideals and learn lessons of literature and history rather than text books to identify social responsibility. Then the understanding of the students will increase Love on books.

Library services should be expanded from time to time. The library needs a cultural center. Book Introductory Sessions, Interviewing Programs, Book Review, Sets and Contests under Read and Review in a book. Likewise, the biographies that inspire visual media as premier, visual compositions of well-known works must be introduced.