ఆకట్టుకుంటున్న “షాదీ ముబారక్” టీజర్

316
Teaser of Shaadi Mubarak Movie

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “షాదీ ముబారక్”. ‌

ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. “షాదీ ముబారక్”’ మార్చి 5న విడుద‌లవుతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

టీజర్ లో హీరోయిన్ త‌ను పెళ్లి చేసుకునే అబ్బాయే కాదు, త‌న ఇంటిపేరు కూడా అందంగా ఉండాల‌ని అనుకోవడం కొత్తగా అన్పిస్తుంది. అలాంటి అమ్మాయికి సున్నిపెంట అనే ఇంటి పేరు ఉండే హీరోతో పెళ్ళి అంటే ఎలా ఉంటుంది ? అనేదే సినిమా కథాంశం.

ఈ టీజర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా “షాదీ ముబారక్” టీజర్ ను వీక్షించండి.