మిల్కీ బ్యూటీ తమన్నా చడీ చప్పుడు లేకుండా సౌందర రాజ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా..! అస్సలు కంగారు పడకండి. సౌందర రాజతో ఏడడుగులు వేసిన తమన్నా గ్రీన్ యాపిల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సీఈవో. ఈవిడ ప్రముఖ తమిళ నటుడు సౌందరరాజని శుక్రవారం వివాహం చేసుకుంది. మధురైలోని టెంపల్ సిటీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగగా సినీ పరిశ్రమకి సంబంధించిన కొందరు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సౌందర రాజ.. ‘సుందరపాండియన్’, ‘జిగర్‌తాండా’, ‘ఎనక్కు వేరు ఎంగుమ్ కిలైగళ్ కడియాదు’ తదితర సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి కోలీవుడ్ అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ‘కల్లాన్’, కాదయ్‌కుట్టి సింగమ్’’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు సౌందర రాజ. ప్రస్తుతం ఈ నూతన జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సౌందర రాజని వివాహం చేసుకున్న తమన్నా