తన సినిమా పై తానే కౌంటర్ వేసుకున్న నాని

550
hero-nani-counter-his-movie

ఫేక్ రివ్యూస్, ఫేక్ కలెక్షన్స్.. ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న మాటలు ఇవి. వస్తున్న చిత్రాలన్నీ ఆడియెన్స్‌కు ఎంత నచ్చాయి అని పక్కనపెడితే తమ చిత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, ఆ రికార్డ్ బ్రేక్, ఈ రికార్డ్ బ్రేక్ అంటూ చాలామంది డప్పుకొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది హీరో నాని మాత్రం తన మూవీపై తానే కౌంటర్ వేసుకున్నాడు.ఇటీవల నాని హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ మూవీ పరాజయంతో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న నాని స్పీడుకు బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ చిత్రం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పెట్టిన ఓ ఛానెల్ సూపర్ హిట్ ‘కృష్ణార్జున యుద్ధం’ను చూసేయండి అంటూ పేర్కొంది. దీనిపై స్పందించిన నాని.. ‘‘సూపర్ హిట్ అంట, అవ్వలేదు బాబాయ్, ఆడలేదు కూడా. అయినా మనసు పెట్టి చేశాం. చూసేయండి’’ అని కామెంట్ పెట్టాడు. ఇలా తన సినిమాపై తానే కామెంట్ పెట్టుకొని అందరినీ ఆకట్టుకున్నాడు నాని. అయితే ఇదే కాదు సోషల్ మీడియాలో తనను రెచ్చగొట్టాలని చూసిన కూడా నాని ఘాటుగానే స్పందిస్తుంటాడు.