దూసుకుపోతున్న జన సమితి కోదండరాం

512
telangana-jana-samtihi-youth-committee-declared

తెలంగాణ ఉద్యమ నేత, జన సమితి పార్టీ అధినేత కోదండరాం పార్టీ నిర్మాణం విషయంలో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం తెలంగాణ యువజన సమితికి రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా యూత్ బలంతోనే నడుస్తుంది. యువత, వారి ఉద్యొగాలు, వారి సమస్యలపైనే తొలినుంచీ తెలంగాణ జన సమితి కేంద్రీకరించి పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి పార్టీకి అనుబంధంగా తెలంగాణ యువజన సమితి రాష్ట్ర కో అర్డినేషన్ కమిటీని కోదండరాం ప్రకటించారు.



 

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు కోదండరాం సమక్షంలో యువజన విభాగం నేతల సమావేశం జరిగింది. యువజన విభాగం బలోపేతం కోసం కోదండరాం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న స్వార్థ, అసమర్థ రాజకీయాలను సమూలంగా మార్చడానికి యువత పెద్ద సంఖ్యలో యువజన సమితిలో చేరాలని పిలుపునిచ్చారు. భారీగా సభ్యత్వ నమోదు, యువజన విభాగం నిర్మాణంపై తక్షణమే దృష్టి సారించాలని యువజన నాయకులకు కోదండరాం సూచించారు.

తెలంగాణ యువజన సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్లువీరే :

ఆశప్ప – ఓయూ
సలీంపాష – ఓయూ
కల్వకుర్తి ఆంజనేయులు – ఓయూ
మాలిగ లింగస్వామి – ఓయూ
పూసల రమేష్ – ఓయూ
వినయ్ – హైదరాబాద్
రమణ్ సింగ్ – హైదరాబాద్
పూడూరి అజయ్ – వికారాబాద్
వెంకట్ రెడ్డి – సూర్యాపేట
శేషు – కేయూ
డా. సంజీవ్ – కేయూ
డా. విజయ్ – కేయూ
నరైన్ – హైదరాబాద్
దాసరి శ్రీను – భూపాలపల్లి
భరత్ – కొత్తగూడెం