డి.రామానాయుడు వర్ధంతి… వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్

233
Suresh Babu And Venkatesh Tributes For D. Ramanaidu

ఈ రోజు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వర్ధంతి. ఈ సందర్భంగా వెంకటేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

“ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ రోజును మరచిపోలేం. ఈ జ్ఞాపకాలను స్మరించుకుంటూనే ఉంటాము.

లవ్ యూ అండ్ మిస్ యూ నాన్న” అంటూ వెంకటేష్ తన తండ్రి రామానాయుడు పిక్ ను షేర్ చేశారు.

మరోవైపు గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు సహా పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ,

సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి ఘనమైన నివాళి ఘటించారు.

కాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు.