చంద్రబాబును కుప్పం ప్రజలు ఇంటికి పంపించారు: రోజా

191
Chandrababu sent home Kuppam people: Roja

పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం ఎదురైందని నగరి వైసీపీ ఎమ్మెల్యే అన్నారు.

మనవడితో ఆడుకోవడానికి చంద్రబాబును కుప్పం ప్రజలు ఇంటికి పంపించేశారని ఎద్దేవా చేశారు.

కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా వాటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయని చెప్పారు.

వాటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు.

1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని రోజా గుర్తుచేశారు.

మూడు దశాబ్దాలకు పైగా టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న చోట వైసీపీ జెండా ఎగిరిందని చెప్పారు.టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని రోజా వ్యాఖ్యానించారు.