ఈ రోజు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వర్ధంతి. ఈ సందర్భంగా వెంకటేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
“ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ రోజును మరచిపోలేం. ఈ జ్ఞాపకాలను స్మరించుకుంటూనే ఉంటాము.
లవ్ యూ అండ్ మిస్ యూ నాన్న” అంటూ వెంకటేష్ తన తండ్రి రామానాయుడు పిక్ ను షేర్ చేశారు.
Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH
— Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021
మరోవైపు గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు సహా పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ,
సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి ఘనమైన నివాళి ఘటించారు.
కాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు.