‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు

1213
Sudheer Babu new movie titled Aa Ammayi Gurinchi Meeku Cheppali​

యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించాడు.

సుధీర్ బాబు, విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరోసారి పని చేయబోతున్నారు.

ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలు తెరకెక్కాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రూపొందనుంది.

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోమవారం ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.

ఇంద్రగంటి మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు సుధీర్ బాబు. ఇటీవలే ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘యాత్ర’ నిర్మాతలు నిర్మిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ షూటింగ్ పూర్తి చేశాడు.

ఇక హీరోయిన్ కృతి శెట్టి విషయానికొస్తే… ‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ మొదలైంది.