తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో పట్టభద్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై పట్టభద్రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి అన్నారు.