తెలుగు, అటు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య. ప్రస్తుతం ఎన్‌జీకే చిత్రంతో పాటు కప్పం అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు సూర్య. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌జీకే చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 14న చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఇక ఆర్య, మోహన్‌లాల్, సూర్య ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కప్పం చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే సూర్య 38వ చిత్రానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇరుది సుట్రై ఫేం సుధా కె ప్రసాద్ దర్శకత్వంలో సూర్య తన 38వ చిత్రాన్ని చేయనుండగా,ఈ మూవీని ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారట. జీవీ ప్రకాశ్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. గత చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రానికి తాను సంగీతం అందించనున్నట్టు జీవీ ప్రకాశ్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు