పెండింగ్ చలానాలు ఉన్నాయా-బీకేర్ పుల్

749
Traffice Fine

వాహనాల పెండింగ్‌ చలానాలపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. డీసీపీ ఆదేశాల మేరకు రెండు రోజులుగా గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. 10 చలానాల నుంచి వందకు పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్నా, జరిమానా చెల్లించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తిస్తున్నారు. పట్టుపడిన వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

ఈ క్రమం లో టీఎస్‌ 32టి 2444 కారుకు 101, మరో కారు టీఎస్‌ 07యుఏ9202కు 120 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాటిని సీజ్‌ చేసి, వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు చలానాలు చెల్లించాలని
ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు కోరారు.