బుధవారం 30 జనవరి 2019 రాశి ఫలాలు

283
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేష రాశి
ఈ రోజు ఒక సంఘటన మీ మనస్సు చెదిరిపోయేలా చేస్తుంది. మిత్రులతో అనవసర వివాదం కానీ, పెట్టుబడి సేదా కొనుగోలు కారణంగా ఆర్థిక నష్టం గానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

వృషభ రాశి
ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తికి కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలదినం.

మిథున రాశి
ఈ రోజు ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో గానీ, కోర్టు కేసుల్లో గానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.




 

కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సంతానం గురించి ఎదురుచూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

సింహ రాశి
ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య రాశి
ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు గానీ, ట్రాన్స్‌ఫర్ గానీ ఉంటుంది.

తుల రాశి
ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం గానీ, బాగు చేయించడం గానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు.

వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం గానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం గానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

ధనుస్సు రాశి
ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.


మకర రాశి
ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

కుంభ రాశి
ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

మీన రాశి
ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.